అవినీతి హెచ్‌ఎంపై చర్యలు తీసుకోకపోతే జులై 31న నిరాహార దీక్ష: జేఏసీ రాష్ట్ర కార్యదర్శి బొలుగూరి ముకేష్

కొతులారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (MPPS) హెచ్‌ఎం పోకబత్తి వివేకానంద్ అవినీతి, ఫోర్జరీ సంతకాలు, అభ్యంతరకర ప్రవర్తనకు సంబంధించి ఆధారాలతో ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు శాఖాపరమైన చర్యలు తీసుకోలేదని కార్పొరేట్ విద్యా నియంత్రణ JAC రాష్ట్ర కార్యదర్శి బొలుగూరి ముకేష్ తెలిపారు. ఈ విషయమై జులై 23న కార్పొరేట్ విద్యా నియంత్రణ JAC, చరణ్య శ్రీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో "చలో DEO కార్యాలయం" పేరుతో మహా నిరసన ధర్నా నిర్వహించినప్పటికీ స్పందన లేకపోవడంతో సోమవారం DEOకు ముందస్తు నిరాహార దీక్ష నోటీసు అందజేశారు....