PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 1:20 pm Posted by : Praja Sankshemam News

తెలంగాణలో త్వరలో కుటుంబ రిజిస్టర్ ప్రక్రియ

తెలంగాణ ప్రజలకు త్వరలో కుటుంబ రిజిస్టర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. పౌర సేవలను సులభతరం చేసే లక్ష్యంతో కుటుంబ రిజిస్టర్‌ చేయాలని భావిస్తోంది. రికార్డ్‌ రూపంలో కుటుంబ వివరాలు అందుబాటులో ఉండేలా కీలక నిర్ణయం తీసుకుంది. మీ సేవ కేంద్రం ద్వారా కుటుంబ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ జారీ చేయనుంది. మీ సేవ కేంద్రం, మీ సేవ ఆన్‌లైన్‌ పోర్టల్‌ యాప్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది