PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 6:22 am Posted by : Praja Sankshemam News

నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం నిర్వహణ.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న యాదాద్రి జోన్-5 డీఐజీ డి. జోయెల్ డేవిస్.!

ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించడమే ప్రతి పోలీసు అధికారి లక్ష్యం.- డీఐజీ డి. జోయెల్ డేవిస్

శాంతిభద్రతల విషయంలో రాజీ లేదని, నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలే విజయానికి మూలమని స్పష్టం…

ప్రతి కేసులో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు…

నల్లగొండ జిల్లా పోలీసు శాఖ పనితీరు ప్రశంసనీయమని, ఇదే అంకితభావంతో సేవలు కొనసాగించాలని సూచన…

సైబర్ నేరాలు, గంజాయి అక్రమ రవాణా, మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశం…

కమ్యూనిటీ పోలీసింగ్, నైట్ పెట్రోలింగ్, నాకాబందీలు, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లను మరింత సమర్థవంతంగా నిర్వహించాలి…

యాదాద్రి జోన్-వి డీఐజీ డి. జోయెల్ డేవిస్. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లాలో శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, ట్రాఫిక్, సైబర్ క్రైమ్, పెండింగ్ కేసులపై ప్రజెంటేషన్ సమర్పణ…సమావేశంలో అదనపు ఎస్పీ రమేష్, ఎస్‌బీ డీఎస్పీ మల్లారెడ్డి, నల్లగొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి, దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, డీటీసీ డీఎస్పీ నగేష్, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, జిల్లా సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు..