PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 4:32 pm Posted by : Praja Sankshemam News

పార్లమెంట్ వద్ద రాహుల్, ప్రియాంక గాంధీలతో కలిసి నిరసనలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేసిన విద్యార్థులపై పోలీసుల చర్యను నిరసిస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారితో కలసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సహా ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్లోని మకర్ ద్వార్ వద్ద నిరసన చేపట్టారు. విద్యార్థుల ఉద్యమంపై పోలీసుల బలప్రయోగానికి బాధ్యత వహిస్తూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ క్షమాపణలు చెప్పాలని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య డిమాండ్ చేశారు.