పి.వి. నరసింహారావు గారి పేరుతో ప్రత్యేక వారసత్వ పురస్కారం
తెలంగాణ టెలివిజన్ రంగంలోని ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తొలిసారిగా అందజేయనున్న 'తెలంగాణ రాష్ట్ర టెలివిజన్ అవార్డ్స్ (TGSTA)' నిర్వహణకు సంబంధించిన విధివిధానాలు, లోగో, అవార్డు కేటగిరీలపై రాష్ట్ర సచివాలయంలో కమిటీ సభ్యులతో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ఆత్మను, సంస్కృతిని ప్రతిబింబించేలా అవార్డుల రూపకల్పన ఉండాలని, విజేతల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, విశ్వసనీయంగా జరగాలని అధికారులకు సూచించారు. టెలివిజన్...