భద్రకాళి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన శాకాంబరీ మహోత్సవాలు…ప్రత్యేక పూజలు నిర్వహించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య
వరంగల్ ప్రజల ఆరాధ్యదైవం, కాకతీయుల ఇలవేల్పు అయిన శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరీ మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 15 రోజుల పాటు నిర్వహించనున్న మహోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయానికి చేరుకున్న వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య గారికి దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు అయ్యగారు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో...