సబ్ సెంటర్లు, పిహెచ్సిలు, సిహెచ్సిలు, ఏరియా ఆసుపత్రుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం .

 నియోజకవర్గ వ్యాప్తంగా సబ్ సెంటర్లు పీహెచ్సీలు సిహెచ్సిలు ఏరియా ఆసుపత్రులను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి అవసరమయ్యే మౌలిక సదుపాయాలు, సిబ్బంది, సాంకేతిక పరికరాలు, కావలసిన నిధులకు సంబంధించిన వివరాలతో ప్రణాళికలు సిద్ధం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా నల్గొండ జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు.. మునుగోడు లోని క్యాంపు కార్యాలయంలో వైద్యశాఖ సమస్యలు, చేయాల్సిన అభివృద్ధి పై యాదాద్రి భువనగిరి జిల్లా వైద్యాధికారులు నల్గొండ జిల్లా వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.....