ప్రజా సంక్షేమం న్యూస్
అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు ఆ యోధుడికి ఘనంగా నివాళులర్పించారు. అన్యాయాన్ని ఎదిరించి, సమానత్వం కోసం పోరాడిన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. సర్వాయి పాపన్న గారు చూపిన ధైర్యం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.