PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 12:42 pm Posted by : guntakamadhu@gmail.com

అనుముల మండలం సర్పంచ్ పోరం అధ్యక్షుడుగా కందుల మదన్ రెడ్డి!

ప్రజా సంక్షేమం న్యూస్ – హాలియా
ఈరోజు నాగార్జునసాగర్ నియోజవర్గంలో హాలియా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు అనుముల మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కందుల మదన్ రెడ్డిని నాగార్జునసాగర్ శాసన సభ్యులు జయ వీర్ గారు అధికారికంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్లభ రెడ్డి,వైస్ చైర్మన్ కలసాని చంద్రశేఖర్,హాలియా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గౌని రాజ రమేష్ యాదవ్, భానుచందర్ రెడ్డి, రవి నాయక్, లాలు నాయక్, పగడాల సైదులు, బిట్టు రవి, బద్రి నాయక్, తదితరులు పాల్గొన్నారు.