ఆగస్టు 14న రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు మీదుగా మహాత్మా ఫూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ.
సమిష్టి ఐక్యతను చాటుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజా సంక్షేమం న్యూస్ మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ ఏర్పాట్లపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాసబ్ ట్యాంక్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లోని ఎస్.ఆర్. శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, బీసీల ఆకాంక్షలను...