ఇక ప్రైవేట్‌ పాఠశాలలపై ఫిర్యాదులకు ఆన్‌లైన్‌ విధానం!

ప్రజా సంక్షేమం న్యూస్ రాష్ట్రంలో ప్రైవేట్‌ పాఠశాలలకు సంబంధించి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు,వాటిని అధికారులు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకునేందుకు ఆన్‌లైన్‌ ప్రైవేట్‌ స్కూల్‌ కంప్లైంట్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ను పాఠశాల విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది.ప్రస్తుతం ఫిర్యాదులు చేయాలంటే స్వయంగా అధికారులను కలవాల్సి ఉంటుంది.వాటిని స్వీకరించిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకున్నారన్న సమాచారం ఫిర్యాదుదారులకు అందదు.ఈ క్రమంలో ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేసే విధానాన్ని ప్రవేశపెట్టినట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్‌ నికోలస్‌ తెలిపారు.దీనివల్ల అధికారులు సైతం చర్యలు తీసుకోవచ్చు. www.schooledu.telangana.gov.in/pscmsలో ఫిర్యాదుదారులు తమ మొబైల్‌ నంబరుతో...