ఇన్సూరెన్స్ ఉంటేనే పెట్రోల్-కొత్త రూల్స్ ఇవే..
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులపైనా పెరిగిపోతున్న ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు సుప్రీంకోర్టు ఇవాళ ఓ ప్రతిపాదన చేసింది. రోడ్డు భద్రతను పటిష్టం చేయడంతో పాటు నిబంధనల్ని పాటించేలా వాహనదారులపై ఒత్తిడి పెంచేందుకు కీలక ప్రతిపాదన చేసింది. ఇకపై వాహనాలకు ఇన్సూరెన్స్ ఉంటేనే వాటికి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోసేలా చట్టంలో మార్పులు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించింది. రోడ్లపై 56 శాతం ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు తిరుగుతున్నట్లు గుర్తించిన సుప్రీంకోర్టు.. వాటిని పెట్రోల్, డీజిల్ సరఫరాతో లింక్ చేసేలా ఓ కొత్త...