ఈ వినాయక చవితికి మట్టి వినాయకుడినే ప్రతిష్టిద్దాం
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి – చారణ్య శ్రీ ఫౌండేషన్ ప్రత్యేక కథనం | ప్రజా సంక్షేమం న్యూస్ వినాయక చవితి భారతీయుల ఆధ్యాత్మిక విశ్వాసాలతో పాటు ఆనందోత్సాహాలతో జరుపుకునే ప్రముఖ పండుగల్లో ఒకటి. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం అనేక ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. అయితే పండుగను ఆనందంగా జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని చారణ్య శ్రీ ఫౌండేషన్ (CSF) పేర్కొంది.ఈ వినాయక చవితి సందర్భంగా ప్రజలు...