PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 5:38 am Posted by : Doctor22

ఉద్యాన శాఖలో ఉద్యాన విస్తరణ అధికారుల భర్తీకి మోక్షం ఎప్పుడో?

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ కింద ఉన్న ఉద్యాన రంగాన్ని ఆనాటి ముఖ్యమంత్రి డా “వై ఎస్.రాజశేఖర్ రెడ్డి గారు ఉద్యాన ప్రాముఖ్యత నీ గుర్తించి ఉద్యాన రంగాన్ని బలోపేతం చేయాలని భావించి రాష్ట్రం లో ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ యూనివర్సిటీ పేరుతో తాడేపల్లి గూడెం లో హార్టికల్చర్ యూనివర్సిటీ నీ స్థాపించాడు. కాలక్రమేనా ఆ యూనివర్సిటీ వై ఎస్ ర్ మరణానంతరం డా”వై ఎస్ ర్ యూనివర్సిటీ గా రూపుదిద్దుకుంది . తెలంగాణ ఏర్పడిన అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ గా పిలవబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో డిప్లొమా కాలేజీ లు రెండు, ఉద్యాన గ్రాడ్యుయేట్ కాలేజీలు నుండి 2003సంవత్సర నుండి ప్రతి ఏటా ఒక 400 మంది విద్యార్థులు బయటికి వస్తున్న వారికి ఇంతవరకు ఉద్యోగ బర్తీ లేకపోవడం శోచనీయం.. దీని ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు చేరవలసిన సాంకేతికత, అవగాహన లోపం తో ఇటు రాష్ట్రంలో ఉన్న రైతులు మరియు విద్యార్థులు నష్టపోతున్నారు. మరియు వీరు చదివిన చదువులు మన రైతాంగానికి ఉపయోగ పడాలంటే తక్షణమే ఉద్యాన శాఖలో ఉద్యాన విస్తరణ అధికారుల భర్తీ చేపట్టవలసి ఉన్నది.. వ్యవసాయ శాఖ కి ప్రభుత్వం ఊతం ఇస్తున్నట్లు గానే ఉద్యాన రంగాన్ని కూడ బలోపేతం చేయాలని అవసరం ఎంతైనా ఉన్నది… కనీసం ఈ ప్రభుత్వం మానిఫెస్ట్ లో భాగంగా ప్రకటించిన ఉద్యాన విస్తరణ అధికారుల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తుందని ఇటూ నిరుద్యోగులు , రైతులు ఎదురు చూస్తున్నారు.