* రోస్టర్ విధానం, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు మంగళం పాడారని తీవ్ర ఆరోపణలు.
* ఆధారాలతో సహా వినతిపత్రం సమర్పణ – బాధ్యులపై కఠిన చర్యలకు డిమాండ్..
ప్రజా సంక్షేమం న్యూస్</strong
మహాత్మా గాంధీ యూనివర్సిటీ (MGU)లో ఇటీవల చేపట్టిన ఔట్‌సోర్సింగ్ నియామక ప్రక్రియ తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతీ నియామకంలో రోస్టర్ పాయింట్లు మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ (Rule of Reservation) తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అయితే, ఎంజీయూ యాజమాన్యం మరియు కాంట్రాక్ట్ ఏజెన్సీలు కుమ్మక్కై సామాజిక న్యాయ సూత్రాలకు నీళ్లు వదిలారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
పేపర్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం మరియు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ మార్గదర్శకాలను పక్కన పెట్టడం వల్ల వేలాది మంది స్థానిక అర్హులైన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని కోల్పోయారనేది ప్రధాన ఆరోపణ. నోటిఫికేషన్ రహస్యంగా ఉంచి, రోస్టర్ పాటించకపోవడం ద్వారా వెనుకబడిన, ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కులను కాలరాశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.వ్యవహారంలో గతంలోనే వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్, ఉన్నత విద్యా మండలి మరియు జిల్లా కలెక్టర్‌లకు వినతిపత్రాలు ఇచ్చినా ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. స్థానిక స్థాయిలో న్యాయం జరగకపోవడంతోనే విద్యార్థి నాయకులు నేరుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ ప్రతినిధులను కలిసి పూర్తి ఆధారాలు సమర్పించాల్సి వచ్చింది.నిబంధనల ఉల్లంఘన నిజమని తేలితే ఈ నియామకాల ప్రాసెస్ రద్దు చేసి, బాధ్యులైన అధికారులతో పాటు ప్రైవేట్ ఏజెన్సీపై చట్టపరమైన/ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.