కామ్రేడ్ గాదెగాని మల్లయ్య గారి 21వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
ప్రజా సంక్షేమం న్యూస్:మోటకొండూరు యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల పరిధిలోని ఆరెగూడెం గ్రామంలో సీపీఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కామ్రేడ్ గాదెగాని మల్లయ్య గారి 21వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామ్రేడ్ నల్ల ప్రదీప్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, పేరబోయిన మహేందర్, మండల కార్యదర్శి గాదెగాని మాణిక్యం తదితరులు మల్లయ్య గారి స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం...