గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్టు!

ప్రజా సంక్షేమం న్యూస్ నిడమనూరు మండలం కోటమైసమ్మ గుడి వద్ద గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.SI విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో గస్తీ నిర్వహించి జటావత్ వినోద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు CI రాఘవరావు తెలిపారు.2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు.కొండమల్లేపల్లి మండలం రమావత్‌తండాకు చెందిన వినోద్‌పై గతంలో ద్విచక్రవాహనాలు,ఫోన్ల చోరీ కేసులు ఉన్నట్లు తెలిపారు. మరో నిందితుడు మహేష్ పరారీలో ఉన్నాడన్నారు.