గోల్ఫ్ టూరిజానికి ప్రపంచస్థాయి మౌలిక వసతులు: జూపల్లి
షామీర్‌పేట్ సమీపంలోని జవహర్‌నగర్‌లో 130 ఎకరాల్లో గోల్ఫ్ కోర్స్.. కృష్ణా నది తీరంలో సోమశిలలో మరో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్స్ ప్రతిపాదన! ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: గోల్ఫ్ టూరిజాన్ని ప్రోత్సహించడంతో పాటు తెలంగాణను అంతర్జాతీయ గోల్ఫ్ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పర్యాటక,సాంస్కృతిక,పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.షామీర్‌పేట్ సమీపంలోని జవహర్‌నగర్‌లో 130 ఎకరాల విస్తీర్ణంలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. అదేవిధంగా కృష్ణా నది తీరంలోని సోమశిలలో మరో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్స్...