గ్రామాల అభివృద్ధికి గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఉండాలి మంత్రి కోమటిరెడ్డి
గ్రామాల అభివృద్ధికి గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన నల్గొండ జిల్లా, నల్గొండ, తిప్పర్తి మండలాలలో వివిధ గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముందుగా నల్గొండ మండలం, చిన్న సూరారం గ్రామ హమ్లెట్ గ్రామమైన పావురాల గూడెంలో కోటి 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పిడబ్ల్యుడి రోడ్డును మంత్రి ప్రారంభించారు. చిన్న సూరారం, పెద్ద సూరారం, చందనపల్లి గ్రామాలలో ఏర్పాటుచేసిన సమావేశాలలో గ్రామస్తులతో మాట్లాడారు. మహిళా సంఘాలను బలోపేతం...