PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 2:47 pm Posted by : Praja Sankshemam News

గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి ప్రణాళికకు ముఖ్యమంత్రి శ్రీకారం!

ప్రజా సంక్షేమం న్యూస్
గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి ప్రణాళికకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,145 గ్రామీణ రహదారుల అభివృద్ధికి శుభారంభం పలికారు. గ్రామీణ రహదారుల అభివృద్ధికి సంబంధించి ములుగులో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు.పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ములుగు జిల్లా గట్టమ్మ ఆలయం ఎదురుగా నిర్మించిన హ్యామ్ రోడ్ల పైలాన్‌ను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు.గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలు, రాష్ట్రంలోని ప్రధాన రహదారులకు రోడ్లను అభివృద్ధి చేసి అనుసంధానం చేసే ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ రవాణా రంగంలో సరికొత్త అధ్యాయానికి ములుగు కేంద్రంగా తొలి అడుగు పడింది.ఈ కార్యక్రమంలో మంత్రులు ధనసరి అనసూయ సీతక్క గారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.