గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి మరియు సామర్థ్య వృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ సందర్భంగా మండలంలోని గ్రామ పంచాయతీల్లో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్షించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు తదితర ప్రజా అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అభివృద్ధి...