తెలంగాణలో రహదారి మౌలిక వసతులకు భారీ ప్రాధాన్యం: కోమటిరెడ్డి
రూ.30 వేల కోట్లతో రోడ్డు అభివృద్ధి పనులు.. పారిశ్రామిక, వ్యాపార రంగాలకు ఊతం: మంత్రి ప్రజా సంక్షేమం న్యూస్-పెద్దపల్లి,ఆగస్టు 19:తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తూ ముందుకు సాగుతోందని రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.మెరుగైన రహదారి వ్యవస్థతో పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలు విస్తరించి స్థానిక యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గరేపల్లిలో బుధవారం రూ.219.67 కోట్ల విలువైన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM),నాన్-ప్లాన్ రోడ్డు...