తెలంగాణలో రైతుబీమాపై అనిశ్చితి.. ప్రీమియం చెల్లింపు గడువు ముగిసినా చెల్లింపులు జరగలేదన్న ఆరోపణలు
హైదరాబాద్, ఆగస్టు 15: తెలంగాణలో రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే రైతుబీమా పథకంపై అనిశ్చితి నెలకొంది. 2026–27 సంవత్సరానికి రైతుబీమా ప్రీమియం చెల్లింపు గడువు ఆగస్టు 14తో ముగిసినా, ప్రభుత్వం ఇప్పటివరకు ప్రీమియం చెల్లించలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అకాల మరణం చెందిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని ప్రారంభించింది. ఎల్‌ఐసీతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. ప్రతి ఏడాది ఆగస్టు 14వ తేదీలోపు సుమారు రూ.1,400...