PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 3:28 pm Posted by : sandeepemmadi78@gmail.com

*తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సేవలు అమూల్యం: జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

*

* కలెక్టరేట్‌లో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు
* చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు

*ప్రజా సంక్షేమం న్యూస్:*
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు తెలంగాణ భావజాల వ్యాప్తికర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కొనియాడారు.

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతిని పురస్కరించుకొని గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బి. చంద్రశేఖర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పోరాటంలో జయశంకర్ సార్ అందించిన విజ్ఞానం, ఆలోచనలు మరియు చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నార