PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 2:13 pm Posted by : Praja Sankshemam News

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన ఈరోజు మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

కలెక్టరేట్ సమీపంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఈరోజు మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో అశోక్ రెడ్డి, హౌసింగ్ పీడీ లోకి లాల్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,నల్గొండ మాజీ జడ్పిటిసి గుమ్ముల మోహన్ రెడ్డి గార్లు పరిశీలించారు*

ఈనెల 15న రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నారు

ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సమద్, మాజీ కౌన్సిలర్ మందడి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు