ప్రజా సంక్షేమం న్యూస్-నల్గొండ
ఈరోజు 80 వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా 5 వ డివిజన్ కార్పొరేటర్ పున్న జ్ఞానేశ్వరి గణేష్ గారుఅంగన్వాడి పాఠశాల మరియు కేశవ నగర్ నందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అనంతరం జిల్లా హెడ్ క్వార్టర్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు అలాగే నల్గొండ జిల్లాలో గతంలో పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి గారితో కలిసి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయాదిత్య భవన్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గారు,పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి గారు, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో, తో 5 వ డివిజన్ కార్పొరేటర్ సలహాదారులు పున్న గణేష్ గారు మరియు ఐదవ డివిజన్ నాయకులు మరియు ఇతర నాయకులు పాల్గొనడం జరిగింది.