PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 8:02 am Posted by : Praja Sankshemam News

నల్లగొండలో ‘నీలగిరి మహిళా శక్తి’ పెట్రోల్ పంపు ప్రారంభం

నల్లగొండ, ఆగస్టు 15: నల్లగొండ పట్టణంలోని సాగర్ రోడ్డులో నీలగిరి జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘నీలగిరి మహిళా శక్తి’ పెట్రోల్ పంపును రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు.పెట్రోల్ పంపు ప్రారంభించిన అనంతరం మంత్రి మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇటువంటి ఉపాధి, వ్యాపార అవకాశాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, నల్లగొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.అలాగే పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సమాఖ్య ప్రతినిధులు, స్థానిక నాయకులు కార్యక్రమానికి హాజరయ్యారు