(ప్రజాసంక్షేమం న్యూస్ – నల్లగొండ)
నల్లగొండ లో గంజాయి విక్రేతలు,బైక్ దొంగల ముఠాను అరెస్ట్ చేశారు.ఐదుగురు నిందితులను నల్గొండ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసారు.ఒడిశా నుంచి అక్రమంగా గంజాయి రవాణా చేసి విక్రయిస్తున్నట్లు DSP శివరాం రెడ్డి తెలిపారు.చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి 500 చొప్పున విక్రయిస్తున్నట్లు గుర్తించారు వారివద్దనుడి 2.5 కిలోల గంజాయినీ స్వాధీనం చేసుకున్నారు.దీని విలువ సుమారు 25 వేలు ఉంటుందని అంచనా.నిందితుల నుంచి 4 బైక్‌లు,5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు ఈ కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపిపినారు.