నాగార్జునసాగర్‌లో నేడు వరుణ యాగం! పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన.
. వరుణ యాగంలో పాల్గొనేందుకు సీఎం నాగార్జునసాగర్‌కు రానున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. నేడు మధ్యాహ్నం 2 గంటల సమయంలో హైదరాబాద్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్ నుంచి హెలికాప్టర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు నాగార్జునసాగర్ హిల్‌కాలనీలోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్ గ్రౌండ్స్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవిహార్ టూరిజం గెస్ట్‌హౌస్‌కు చేరుకుని కొద్దిసేపు రిజర్వ్ సమయం కేటాయించారు. అనంతరం 3.10 గంటలకు యాగశాలకు చేరుకోనున్న సీఎం, 3.24 గంటలకు వరుణ యాగంలో పూర్ణాహుతి కార్యక్రమంలో...