నాయి బ్రాహ్మణ కార్పొరేషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి: యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు వేముల సత్యనారాయణ

ప్రజా సంక్షేమం న్యూస్: యాదాద్రి భువనగిరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో నాయి బ్రాహ్మణులకు స్థానం కల్పించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని,ప్రభుత్వం నాయి బ్రాహ్మణుల పట్ల చిన్నచూపు చూస్తూ వివక్ష చూపుతోందని యాదాద్రి భువనగిరి జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు వేముల సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం నిర్వహించిన ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు.గతంలో అనేకసార్లు వినతిపత్రాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం బాధాకరమన్నారు.ఎన్నికల సమయంలో నాయి బ్రాహ్మణ వృత్తిని కొనియాడిన ముఖ్యమంత్రి,అధికారంలోకి వచ్చాక ఆ...