ప్రజా సంక్షేమం న్యూస్ -హైదరాబాద్:
రాష్ట్రంలోని నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన “ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం”ను నూతనంగా ప్రారంభించింది. ఈ పథకాన్ని బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని తెలంగాణ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అమలు చేయనున్నారు. అర్హులైన వెనుకబడిన తరగతుల (BC) నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మల్లయ్య బట్టు తెలిపారు.
అర్హతలు & నిబంధనలు:
* వయోపరిమితి: 18 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
* వార్షిక ఆదాయ పరిమితి: గ్రామీణ ప్రాంతాల వారికి గరిష్టంగా రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ. 2.00 లక్షల లోపు ఉండాలి (ఒక సంవత్సరం క్రితం పొందిన ఆదాయ ధ్రువీకరణ పత్రం చెల్లుబాటు అవుతుంది).
కావలసిన పత్రాలు:
* ఆధార్ కార్డు
* రేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం (Income Certificate)
* కుల ధ్రువీకరణ పత్రం (Caste Certificate)
దరఖాస్తు విధానం & గడువు:
అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక TGOBMMS పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
* చివరి తేదీ: 15 సెప్టెంబర్, 2026
* వెబ్‌సైట్: tgobmms.cgg.gov.inమరిన్ని వివరాల కొరకు సంబంధిత జిల్లా బీసీ అభివృద్ధి అధికారి (DBCDO) లేదా ఈడీ బీసీ కార్పొరేషన్ కార్యాలయాన్ని సంప్రదించాల్సిందిగా అధికారులు కోరారు