నిషేధిత జాబితా (22 A) చేరిన భూముల సర్వే నంబర్లకు బై-నంబర్లు ఇచ్చి హక్కుదారుల సమస్యలను పరిష్కరిస్తా:ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి
ప్రజా సంక్షేమం న్యూస్ నిషేధిత జాబితాల్లో ఉన్న భూములకు సంబంధించి హక్కుదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు. నిషేధిత జాబితా (22 A) చేరిన భూముల సర్వే నంబర్లకు బై-నంబర్లు ఇచ్చి హక్కుదారుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కోర్ అర్బన్ (CURE) ప్రాంత పరిధిలో హైదరాబాద్ కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు (టవర్స్) నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, దుద్దిళ్ల...