నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే సాంకేతిక యూనిట్లతో చిన్న నీటిపారుదల వ్యవస్థను తిరిగి ఏర్పాటు చేయాలి:రైతు సంక్షేమ కమిషన్
ప్రజాసంక్షేమం న్యూస్ : రాష్ట్రంలో చిన్న నీటిపారుదల వ్యవస్థపై వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని కలిసి నివేదిక అందించింది. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే సాంకేతిక యూనిట్లతో చిన్న నీటిపారుదల వ్యవస్థను తిరిగి ఏర్పాటు చేయాలని కమిషన్ తన నివేదికలో సూచించింది.తెలంగాణ వ్యవసాయ - రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి గారి నేతృత్వంలో సభ్యులు రాములు నాయక్ గారు, రాంరెడ్డి గోపాల్ రెడ్డి గారు, గంగాధర్ గారు, ఎం....