PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 7:03 pm Posted by : Praja Sankshemam News

నేర నియంత్రణలో నల్గొండ జిల్లా పోలీసుల అద్భుత ప్రతిభ !

ప్రజాసంక్షేమం న్యూస్
నేర నియంత్రణకు సంబంధించిన ప్రమాణాల అమలులో నల్గొండ జిల్లా పోలీసులు క్లస్టర్–3లో అగ్రస్థానంలో నిలిచారు.రాష్ట్ర స్థాయి పోలీసు పనితీరు సమీక్షలో భాగంగా 8 కీలక ప్రమాణాల ఆధారంగా వివిధ జిల్లాల పనితీరును పరిశీలించగా, క్లస్టర్–3లో నల్గొండ జిల్లా ఉత్తమ పనితీరు కనబరిచి మొదటి స్థానాన్ని సాధించింది.ఈ సందర్భంగా డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్, IPS నల్గొండ జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, IPSకు ప్రశంసా పత్రాన్ని అందజేసి, జిల్లా పోలీసుల అద్భుత పనితీరును అభినందించారు.జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది సమష్టి కృషి, అంకితభావం, నిబద్ధతను డీజీపీ ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో విధులు నిర్వహిస్తూ అన్ని రంగాల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, IPS, జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది మరియు వివిధ బృందాలకు అభినందనలు తెలిపారు. వారి సమష్టి కృషి, అంకితభావం వల్లే ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు.
క్లస్టర్–3లో నల్గొండ జిల్లా పోలీసులకు ప్రథమ స్థానం రావడం జిల్లా పోలీసు శాఖకు గర్వకారనము.