PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 2:56 pm Posted by : Praja Sankshemam News

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి హత్య కేసులో విద్యార్థుల అరెస్ట్:జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్

డబ్బు కోసం పథకం.
ప్రధానోపాధ్యాయురాలిపై కక్షతో హత్యకు పాల్పడినట్లు పోలీసుల వెల్లడి!

ఐదు ప్రత్యేక బృందాల దర్యాప్తు:
శాస్త్రీయ దర్యాప్తుతో కేసు ఛేదన:
ఛేదనలో విశేష ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు,సిబ్బందికి రివార్డులు:

ప్రజా సంక్షేమం-న్యూస్ నల్గొండ:
కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసును నల్గొండ జిల్లా పోలీసులు కొద్ది రోజుల్లోనే ఛేదించారు.ఈకేసులో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.డబ్బు కోసం పథకం రూపొందించడంతో పాటు ప్రిన్సిపాల్‌పై ఏర్పడిన కక్ష కారణంగా ఈ హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.కేసు ఛేదనలో శాస్త్రీయ దర్యాప్తు,సీసీ కెమెరాల ఫుటేజీ,ఫోరెన్సిక్ ఆధారాలు,సాంకేతిక విశ్లేషణ కీలకంగా మారాయి.
‘బాబు’అనే చివరి మాటతో కీలక మలుపు:
హత్యకు ముందు బాధితురాలు ఫోన్‌లో మాట్లాడిన సమయంలో చివరిగా “బాబు” అనే పదాన్ని పలికినట్లు పోలీసులు గుర్తించారు.ఈ కీలక ఆధారం ఆధారంగా దర్యాప్తు దిశను పాఠశాల విద్యార్థుల వైపు మళ్లించినట్లు తెలిపారు.దర్యాప్తులో భాగంగా ప్రత్యేక పోలీసు బృందాలు సుమారు 70 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించాయి.దాదాపు 30 కిలోమీటర్ల పరిధిలో ఆధారాలను సేకరించి, 80 మందికి పైగా అనుమానితులను విచారించారు.విశ్వసనీయ సమాచారం,సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితుల నుంచి భారీగా వస్తువుల స్వాధీనం:
– రూ.1.54లక్షల నగదు
– బాధితురాలి ఐఫోన్
– హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న ఆయుధం
– గ్లౌజులు
– మాస్కులు
– రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఐదు ప్రత్యేక బృందాల దర్యాప్తు:
కేసును ఛేదించేందుకు ఏర్పాటు చేసిన ఐదు ప్రత్యేక దర్యాప్తు బృందాలు సమన్వయంతో పనిచేశాయని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల విశ్లేషణ, ఫోరెన్సిక్ ఆధారాలు,సాంకేతిక దర్యాప్తు, ప్రత్యక్ష సమాచారాన్ని సమగ్రంగా పరిశీలించి నిందితులను గుర్తించినట్లు వెల్లడించారు.జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ప్రత్యేక దర్యాప్తు బృందాల అధికారులను,సిబ్బందిని అభినందించారు.కేసు ఛేదనలో విశేష ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి రివార్డులు ప్రకటించారు.
శాస్త్రీయ దర్యాప్తుతో కేసు ఛేదన:
సీసీ కెమెరాలు,ఫోరెన్సిక్ ఆధారాలు,సాంకేతిక విశ్లేషణ వంటి ఆధునిక దర్యాప్తు పద్ధతులను సమర్థంగా ఉపయోగించడంతో ఈ సంచలన హత్య కేసును త్వరగా ఛేదించగలిగామని పోలీసులు తెలిపారు.కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.