పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి హత్య కేసులో విద్యార్థుల అరెస్ట్:జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్
డబ్బు కోసం పథకం. ప్రధానోపాధ్యాయురాలిపై కక్షతో హత్యకు పాల్పడినట్లు పోలీసుల వెల్లడి! ఐదు ప్రత్యేక బృందాల దర్యాప్తు: శాస్త్రీయ దర్యాప్తుతో కేసు ఛేదన: ఛేదనలో విశేష ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు,సిబ్బందికి రివార్డులు: ప్రజా సంక్షేమం-న్యూస్ నల్గొండ: కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసును నల్గొండ జిల్లా పోలీసులు కొద్ది రోజుల్లోనే ఛేదించారు.ఈకేసులో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.డబ్బు కోసం పథకం రూపొందించడంతో పాటు ప్రిన్సిపాల్‌పై ఏర్పడిన...