PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 3:26 am Posted by : Praja Sankshemam News

ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించడానికే – వరుణ యాగం



యాగాల పేరుతో- ప్రజాధనంవృధా:CPM

‘ప్రజా సంక్షేమం’ న్యూస్
యాగాలతో వర్షాలు కురిపించవచ్చని అశాస్త్రీయమైన ఆలోచన విధానాలతో ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ప్రజల సమస్యలను పక్కదారి పట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం,ముఖ్యమంత్రి తీరు ఉన్నదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను, మండల కార్యదర్శి కందుకూరి కోటేష్ లు అన్నారు. ఆదివారం నిడనూరు మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ యాగాలతో ప్రజలకష్టాలు తీరితే, సాంకేతికత, టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందేది కాదని, ప్రజల కష్టాలు తీరడానికి అవసరమైన చర్యలపట్ల ఆవగాహన కలిగి ఉండాలి తప్ప, ఎటువంటి శాస్త్రీయత లేని యాగాల వల్ల ఉపయోగం లేదని వారన్నారు. ప్రజల సెంటిమెంటును అడ్డుపెట్టుకొని ప్రభుత్వం తమ బాధ్యతనుండి తప్పుకొని, ప్రభుత్వాల పట్ల ప్రజలకున్న దురాభిప్రాయాలను, ఆలోచన విధానాన్ని పక్కదారి పట్టించడానికి ఈ సెంటిమెంట్ యాగాలు చేస్తుందని, అధికారికంగా ప్రభుత్వం చేయాల్సిన పని కాదని వారన్నారు. ఒకవైపు నిపుణులు పర్యావరణం కారణంగా వర్షాలు పడటం లేదని చెప్పుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యాగాల పేరుతోటి ప్రజా ధనాన్ని వృధా చేయాలని చూస్తున్నారని, కృష్ణ బేసిన్లో నికర జలాలను రాబట్టడానికి రైతులకు, తాగునీటికి కావాల్సిన నీటి ని కష్టకాలంలో తేప్పించడానికి చేసిన కృషినే ప్రజలు చూస్తారు తప్ప ఇలాంటి వాటిని ప్రజలు విశ్వసించారని వారు అన్నారు. యాగంతో వర్షాలు కురిస్తే ప్రభుత్వం ఖాతాలో, ఖజానా లేనప్పుడు యాగాలు చేసి ఖజానా తెప్పించే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవచ్చు కదా, యాగలతో, క్షుద్ర మంత్రాలతో పేరుతో ప్రజలను మూఢనమ్మకాల వైపు మళ్ళిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, రాష్ట్ర ప్రభుత్వానికి నీటి నిలువల కొరకు ముందు చూపు లేదని . పర్యావరణం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కుంచెం శేఖర్, ముత్యాల కేశవులు తదితరులు వారి వెంట ఉన్నారు

Copyright © 2026 PRAJA SANKSHEMAM NEWS. All rights reserved.