ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
ప్రజా ప్రభుత్వంలో సింగరేణి పరిరక్షణ, విస్తరణతోపాటు రాష్ట్ర ఇంధన భద్రతను సుస్థిరం చేయాలన్న సంకల్పంతో గత 30 నెలలుగా అవిశ్రాంతంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తూ సింగరేణికి కొత్త ఊపిరి లభిస్తోందని, ఈ రోజు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో మణుగూరు ఏరియా అస్తిత్వానికి అతి కీలకమైన పీకే ఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం చారిత్రక విజయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క అభివర్ణించారు. తెలంగాణ ప్రజల ఆస్తి అయిన సింగరేణిని...