PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 1:44 pm Posted by : Praja Sankshemam News

ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన.. బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశం

నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ సుమారు 36 మంది బాధితుల సమస్యలు, ఫిర్యాదులను సవివరంగా విని తెలుసుకున్నారు.భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక లావాదేవీలు, మోసాలు, ఆస్తి సంబంధిత వివాదాలు తదితర అంశాలపై బాధితులు ఎస్పీకి ఫిర్యాదులు సమర్పించారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించిన ఎస్పీ, సంబంధిత పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను నిర్ధారించిన అనంతరం చట్టపరమైన నిబంధనల ప్రకారం సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయకుండా, కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోలీస్ శాఖపై నమ్మకంతో వస్తున్నందున, వారి ఫిర్యాదులను గౌరవంగా స్వీకరించి నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని ఎస్పీ తెలిపారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా జిల్లా ఎస్పీని కలిసి తమ సమస్యలను వివరించే అవకాశం కల్పిస్తున్నామని, ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతతో పరిశీలించి చట్ట పరిధిలో సత్వర పరిష్కారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.