ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన.. బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశం
నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ సుమారు 36 మంది బాధితుల సమస్యలు, ఫిర్యాదులను సవివరంగా విని తెలుసుకున్నారు.భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక లావాదేవీలు, మోసాలు, ఆస్తి సంబంధిత వివాదాలు తదితర అంశాలపై బాధితులు ఎస్పీకి ఫిర్యాదులు సమర్పించారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించిన ఎస్పీ, సంబంధిత పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను...