PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 5:49 pm Posted by : Praja Sankshemam News

ప్రతి ఫిర్యాదు పురోగతిని అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి :ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్

జిల్లా ఎస్పీ ప్రజా ఫిర్యాదులపై సమీక్ష:
ప్రజా సంక్షేమం న్యూస్
జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, IPS సుమారు 32 మంది ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించారు.భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక లావాదేవీలు, మోసాలు, ఆస్తి వివాదాలు తదితర అంశాలపై ఫిర్యాదుదారులు తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.ప్రతి ఫిర్యాదును పరిశీలించిన ఎస్పీ,సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను నిర్ధారించాలని,చట్టపరంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రతి ఫిర్యాదు పురోగతిని అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని,జాప్యానికి తావులేకుండా పారదర్శకంగా,నిష్పక్షపాతంగా,బాధితులకు అనుకూలంగా సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ సూచించారు.ప్రజలు తమ సమస్యలను నేరుగా జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చేందుకు పోలీస్ గ్రీవెన్స్ డే ఒక మంచి అవకాశమని ఆయన తెలిపారు.ప్రతి ఫిర్యాదుకు చట్టపరమైన పరిధిలో ప్రాధాన్యతనిస్తూ పరిష్కారం చూపుతామని ఎస్పీ భరోసా ఇచ్చారు.