PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 5:40 am Posted by : Praja Sankshemam News

ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో బాలింత మృతి?…

ప్రజా సంక్షేమం న్యూస్-నల్గొండ:
నల్గొండ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన మమత (27) అనే బాలింత ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందింది.సమాచారం ప్రకారం.. ప్రసవం కోసం సుమారు ఎనిమిది రోజుల క్రితం మమత నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరింది. ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఇటీవల ఆమె మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది.అయితే తెల్లవారుజామున వార్డు నుంచి బయటకు వచ్చిన మమత.ఆసుపత్రిలోని పోస్టుమార్టం గది సమీపంలో చీరతో ఉరేసుకుని మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆసుపత్రి ప్రాంగణంలో విషాదం నెలకొంది.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మమత ఆత్మహత్యకు గల కారణాలపై కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బందిని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె మృతికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది.
మమత మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.