PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 1:36 am Posted by : Praja Sankshemam News

ఫీల్డ్ అసిస్టెంట్ల న్యాయమైన దీర్ఘకాలిక సమస్యలపై స్పష్టమైన హామీ!

ప్రజా సంక్షేమం న్యూస్
హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో గల TGIPARD లో గౌరవ మన శాఖ మంత్రివర్యులు దానసరి అనసూయ సీతక్క మరియు కమిషనర్ దివ్యా దేవరాజన్ మరియు శాఖ ఉన్నతాధికారులతో గౌరవ INTUC పెద్దలు ఎరగాని నాగన్న గౌడ్ మరియు RD.చంద్రశేఖర్ గార్ల ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్ల న్యాయమైన దీర్ఘకాలిక సమస్యల పైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. చర్చల అనంతరం గౌరవ మంత్రి గారు వేతనాలు పెంచి FTE లుగా కన్వెర్ట్ చేసి,సర్క్యులర్ నెంబర్ 4779 ని రద్దుచేసి అందరికీ ఒకే విధమైన వేదనాలు వచ్చేలా లిస్టు 3 వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని తదితర దీర్ఘకాలిక సమస్యలన్నింటి పైన గౌరవ మంత్రి గారు స్పష్టమైన హామీని ఇవ్వడంతో పాటు గౌరవ సీఎం గారు విదేశీ పర్యటన ముగించుకొని రాగానే వీటన్నింటి పైన ఉత్తర్వులు ఇస్తామని గౌరవ మంత్రి గారు స్పష్టమైన హామీని ఇవ్వడం జరిగింది.కావున ఫీల్డ్ అసిస్టెంట్ మిత్రులందరూ సమయమనంతో ఉండి సహకరించగలరని కోరుచున్నాము. .