బంజారాహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం: 11 మందిని సురక్షితంగా కాపాడిన ఫైర్ సిబ్బంది!

సెల్లార్‌లోని వైన్ మార్ట్ స్టాక్‌ పాయింట్‌లో చెలరేగిన మంటలు కాలిబూడిదైన భారీగా మద్యం బాటిళ్లు సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడిన అగ్నిమాపక సిబ్బంది హైదరాబాద్ (ప్రజా సంక్షేమం): హైదరాబాద్‌లోని ప్రముఖ వ్యాపార ప్రాంతమైన బంజారాహిల్స్‌లో శనివారం దట్టమైన పొగలు, మంటలతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 11లోని బీఆర్కే న్యూస్‌ భవనంలోని సెల్లార్‌లో ఉన్న 'దారువాలా వైన్‌ మార్ట్‌' స్టాక్‌ స్టోరేజీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయాందోళనలో పరిసర ప్రాంత ప్రజలు: సెల్లార్‌ భాగం నుంచి పెద్ద ఎత్తున దట్టమైన పొగలు, మంటలు...