PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 12:19 am Posted by : Praja Sankshemam News

బీసీ మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ!బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్


*ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1,000 మంది మహిళలకు లబ్ధి.
*బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్… త్వరలోనే మార్గదర్శకాల విడుదల.
*ఆన్‌లైన్ మరియు మీ-సేవ (Meeseva) ద్వారా దరఖాస్తుల స్వీకరణ.

ప్రజా సంక్షేమం న్యూస్
ప్రభుత్వం వెనుకబడిన తరగతుల (BC) మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధిని ప్రోత్సహించే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ మహిళలు సొంతంగా ఉపాధి పొంది ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, వారి శ్రమను తగ్గించి వేగంగా కుట్టు పనులు చేసుకునేందుకు ఉచితంగా అధునాతన ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
పథకం యొక్క ముఖ్యాంశాలు: మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం, ఆధునిక యంత్రాల ద్వారా వారి ఆదాయాన్ని పెంచడం.ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1,000 మంది అర్హులైన మహిళలను ఎంపిక చేసి ఈ ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందజేస్తారు. సంక్షేమ శాఖ మంత్రి పొన్నంప్రభాకర్ ఈ పథకానికి సంబంధించిన పూర్తి విధివిధానాలు, అర్హతలు మరియు స్పష్టమైన మార్గదర్శకాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.మహిళల నుంచి దరఖాస్తులను అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ మరియు మీ-సేవ (Meeseva) కేంద్రాల ద్వారా స్వీకరించనున్నారు.
త్వరలో వెలువడనున్న పూర్తి వివరాలు:లబ్ధిదారుల వయోపరిమితి సడలింపులుకుటుంబ వార్షిక ఆదాయ పరిమితి.నిబంధనలుఅవసరమైన పత్రాలు, (కులాంతర/కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ మొదలైనవి)దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం మరియు ఆఖరి తేదీల షెడ్యూల్
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది బీసీ మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.

‘ప్రజా సంక్షేమం’ న్యూస్ రిపోర్ట్: దోమలపల్లి గోపి (ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రతినిధి) | 9248307393