బునాది గాని కాలువ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి రైతాంగానికి సాగు నీరు అందించాలి
బస్వాపురం ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసి చెరువులను నింపి సాగునీరు అందించాలి యాదాద్రి భువనగిరి(ప్రజా సంక్షేమంన్యూస్): బునాది గాని కాలువ వెడల్పు మరియు కల్వర్టు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి రైతాంగానికి సాగు నీరు అందించాలని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి వేముల బిక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బస్వాపురం ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసి ఆయా గ్రామాలలోని చెరువులను నింపి రైతులకు ఎదురవుతున్న సాగునీటి ఇబ్బందులను తీర్చాలని సూచించారు.శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద...