మంత్రి సీతక్క చొరవతో అంగన్‌వాడీ సిబ్బందికి పెరిగిన రిటైర్మెంట్ బెనిఫిట్స్
60 ఏళ్లు దాటిన వారు స్వచ్ఛందంగా వైదొలిగినా ప్రయోజనం.. ఇప్పటివరకు 2,572 మందికి రూ.15.61 కోట్ల చెల్లింపు హైదరాబాద్: అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం పెంచిన సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్‌ను అందిస్తోంది. 65 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేసిన వారికి పెంచిన మొత్తంతో పాటు, 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలిగినా ఈ ప్రయోజనాలను వర్తింపజేస్తోంది. 2023లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అంగన్‌వాడీ టీచర్లకు రూ.1 లక్ష, అంగన్‌వాడీ హెల్పర్లు, మినీ...