మట్టి వినాయకుడే ముద్దు.. పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత!
బిచ్కుంద ఎస్‌ఐ జి. రాజుకు వినతిపత్రం సమర్పించిన సీసీఆర్ ప్రతినిధి సుశీల్ కుమార్ ఎంఆర్‌ఓ,ఎంపీడీఓ కార్యాలయాలకు కూడా వినతిపత్రాలు అందజేత ప్రజా సంక్షేమం న్యూస్ (బిచ్కుంద, ఆగస్టు 29): రానున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ,మట్టి వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరుతూ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.సీసీఆర్ కామారెడ్డి ప్రతినిధి సుశీల్ కుమార్ బిచ్కుంద ఎస్‌ఐ జి.రాజును కలసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులకు...