PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 8:44 am Posted by : Praja Sankshemam News

మర్రిగూడలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు…

ప్రజా సంక్షేమం న్యూస్ – మర్రిగూడ:
భారత మాజీ ప్రధానమంత్రి,భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పార్టీ నాయకులు,కార్యకర్తలు బస్‌స్టాండ్‌లోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, ఆధునిక భారత నిర్మాత స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మర్రిగూడ మండలం అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ గారు ఆ మహానేతకు ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. యువతకు ప్రాధాన్యత, ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడం, దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.అనంతరం రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను నిర్వహించి, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.“దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, మత సామరస్యం, ఐక్యతను పెంపొందించాలనే సందేశంతో జరుపుకునే సద్భావనా దినోత్సవం ప్రజలందరికీ ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంది.‘సమైక్యతే మన శక్తి – సద్భావనే మన ప్రగతి’ అనే స్ఫూర్తితో రాజీవ్ గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని,శాంతి, సౌభ్రాతృత్వం, సమానత్వంతో కూడిన బలమైన భారతదేశ నిర్మాణానికి మన వంతు కృషి చేద్దాం” అని రామదాసు శ్రీనివాస్ గారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామాదాసు శ్రీనివాస్,మాజీ Zptc మేతరీ యాదయ్య,మాజీ mptc వేంకటంపేట బాలయ్య,భీమన్నపల్లి మాజీ సర్పంచ్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు కొడాలా వెంకట్ రెడ్డి, రామావత్ లక్ష్మణ్, సిరసనవాడ బిక్షమయ్య య, లక్ష్మణ్ నాయక్, పందుల లక్ష్మీ జంగయ్య కల్లేట్ల లింగయ్య మాజీ సర్పంచులు కొట్టం రమేష్, బిచ్చు నాయక్, లుల్దయ్య, హైతపాక జంగయ్య జంగిలి, లక్ష్మీ ప్రసన్న రవి ఓకే ఓకే డైరెక్టర్ పగడాల లింగయ్య మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జమ్ముల వెంకటయ్య మేతెరి శంకర్, ఆకారపు శ్రీనివాస్, శివ, శిరిపంగా శ్రీను, వడ్డే ముత్యాలు, పానగంటి శేఖర్ , మెండు ప్రవీణ్, ఎలిమినేటి సత్తి రెడ్డి, ఇబ్రాం మతంగి నవీన్,ఎదుదొడ్ల విష్ణు వర్ధన్ రెడ్డి,సిలివేరు యాదయ్య, గ్యార వెంకటేష్, తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు….