మర్రిగూడలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు…
ప్రజా సంక్షేమం న్యూస్ - మర్రిగూడ: భారత మాజీ ప్రధానమంత్రి,భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పార్టీ నాయకులు,కార్యకర్తలు బస్‌స్టాండ్‌లోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, ఆధునిక భారత నిర్మాత స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మర్రిగూడ మండలం అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ గారు ఆ మహానేతకు ఘన...